ఖమ్మం: పన్ను రాయితీని వినియోగించుకోండి

1చూసినవారు
ఖమ్మం: పన్ను రాయితీని వినియోగించుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్లీబర్డ్ స్కీం కింద ఈ నెలలో ఆస్తి పన్నులు చెల్లించేవారికి ప్రకటించిన ఐదు శాతం పన్ను రాయితీని వినియోగించుకోవాలని కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఖమ్మంలోని పన్ను చెల్లింపుదారుల వద్దకు వెళ్లి పన్నులు కట్టించుకున్నారు. పన్ను చెల్లింపుల కోసం కేఎంసీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, కార్యాలయానికి రాలేనివారు మీసేవా, టీఎస్ ఆన్లైన్ సెంటర్లలో, ఫోన్ ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చని తెలిపారు. ఈ స్కీం ద్వారా రాయితీతో పాటు అపరాద రుసుం కింద రూ. 2 వడ్డీ భారం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్