డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్(టీసీసీ) కేటగిరీల్లో అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 17వరకు పరీక్షలు జరుగుతాయని డీఈఓ సోమశేఖరశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు కొద్దిరోజుల ముందు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు, ఇతర వివరాల కోసం www. bse. telangana. gov. in వెబ్ సైట్లో సంప్రదించాలని డీఈఓ తెలిపారు.