ఖమ్మం: బాల్యం నుంచే విలువల బోధన

2చూసినవారు
ఖమ్మం: బాల్యం నుంచే విలువల బోధన
జిల్లా మహిళా సాధికారత కేంద్రం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పిల్లల్లో విలువలు పెంపొందించేందుకు అందరూ పాటుపడాలని సూచించారు. జిల్లాలో 'చిన్నారి' పేరిట రూపొందించిన కార్యక్రమంలో వేయి విద్యాసంస్థల్లో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించామని, ఈవిషయమై తల్లిదండ్రులు కూడా వివరించాలని ఆమె తెలిపారు.