ఖమ్మం: కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ

2చూసినవారు
ఖమ్మం: కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడానికి కేసీఆర్ అనేకసార్లు పదవులను త్యాగం చేశారని, సబ్బండ వర్గాలు ఆయనతో కలిసి పోరాడటంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించగా, బీఆర్ఎస్ పతాకాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్