ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇటీవల వందలాది నిర్మాణాలను కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు వందలాది కుటుంబాలతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. భూదాన్ కమిటీ ద్వారా పట్టాలు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించడంతో పది ఇళ్లను అధికారులు వదిలేశారు. మిగిలిన 700 గృహాలను కూల్చివేయడంతో, శిథిలాల నడుమ ఆ పది ఇళ్లలోని వారు భయాందోళనలతో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది.