జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, అంగన్ వాడీ కేంద్రాలకు అవసరమైన కోడిగుడ్ల సరఫరా కోసం ఆగస్టు మొదటి వారంలోగా టెండర్లు ఖరారు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీజ సూచించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో పలు అంశాలపై సమీక్షించారు. హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర విద్యాసంస్థలకు జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలోనే అవసరమైన కోడిగుడ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.