ఖమ్మం ప్రభుత్వ (విజయ) పాడి పరిశ్రమ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25 వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ. 15వేలు అద్దె, రూ. 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. మరిన్ని వివరాలకు 99598 77109 నంబర్ ను సంప్రదించవచ్చు.