సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అర్థమయ్యే గుర్తులు వస్తే బాగుంటుందని, ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని వారు ఆందోళన చెందుతున్నారు.