హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహిస్తున్న తెలంగాణ టీ-20 క్రికెట్ టోర్నీని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరపాటి ప్రదీప్ డిమాండ్ చేశారు. కేవలం హైదరాబాద్‌కే క్రికెట్‌ను పరిమితం చేసి, జిల్లాల్లోని నైపుణ్యం కలిగిన క్రీడాకారులను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెటర్లకు అవకాశం కల్పించాలన్న బీసీసీఐ సూచనలకు విరుద్ధంగా హెచ్సీఏ వ్యవహరిస్తోందని, తీరు మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రదీప్ హెచ్చరించారు.