ఖమ్మం: అది బీజేపీ బడ్జెట్ మాత్రమే

76చూసినవారు
ఖమ్మం: అది బీజేపీ బడ్జెట్ మాత్రమే
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ బీజేపీ బడ్జెట్ మాత్రమేనని, ఆ పార్టీ రాజకీయ అవసరాలను తీర్చేలా కేటాయింపులు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఖమ్మం గిరిప్రసాద్ భవనంలో సోమవారం జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధానాలతో పేదలు మరింత పేదలవుతుంటే సంపన్నులు ఇంకొంత సంపద పోగేసుకునే అవకాశం వస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్