కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ మోసం చేస్తుందని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీయూసీఐలో విలీనమైన తర్వాత నిర్వహించే తొలి రాష్ట్ర మహాసభలను ఈనెల 21, 22 తేదీల్లో నిజామాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.