పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి రామయ్య పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య అని తెలిపారు. కార్యక్రమంలో భూక్యా శ్యామ్ సుందర్, నున్నా రవికుమార్, అల్లిక అంజయ్య ఉన్నారు.