ఖమ్మం వీడీవోస్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి గౌరవాన్ని దేశ వ్యాప్తంగా చాటిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ పేరు మీద పార్క్ ఏర్పాటు ఖమ్మం నగరానికి గర్వకారణమని తెలిపారు. తనకు ఓట్లు ముఖ్యం కాదని, రహదారులు విస్తరణతో ప్రజా సౌకర్యం ముఖ్యమని పేర్కొన్నారు.