ఖమ్మం: ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం: మంత్రి

4చూసినవారు
ఖమ్మం: ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం: మంత్రి
ఆదివారం ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో సీనియారిటీ, ప్రజల్లో గుర్తింపు, గెలుపు సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తామని, ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు ఉన్న చోట చర్చల ద్వారా ఏకైక అభ్యర్థిని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు నాగండ దీపక్ చౌదరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్