ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితుల జీవితాలను ప్రభుత్వం చీకట్లో నెట్టిందని జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చడం బాధాకరమని అన్నారు. బాధితులకు అండగా జాతీయ ఎస్టీ కమీషన్ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.