ఖమ్మం జిల్లాలో సీపీఎం నేతలు హత్యలకు గురికావడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. 2022లో దుండగుల చేతిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుతం చింతకాని (M) పాతర్లపాడులో రామారావు అదే రీతిలో దుండగుల చేతిలో హతమయ్యాడు. వీరిద్దరూ స్థానికంగా బలమైన, పార్టీలో కీలక నేతలు కావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలోనే.. అది కూడా CPM నేతలే హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది.