మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, మెను చార్జీలను తక్షణమే చెల్లించాలని, లేనియెడల నవంబర్ 12న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో ఏవోకి కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. గత పది నెలలుగా కోడిగుడ్ల బిల్లులు, మెనూ చార్జీలు, గౌరవ వేతనం పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.