ఖమ్మం పాత ఎన్ఎస్పీ క్వార్టర్స్ లోని వేయి కుటుంబాలకు 50 ఏళ్లుగా తాగునీటిని అందించిన బావిని వెంటనే పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. శనివారం నూతన బస్టాండ్ వెనుక గల పాత బావిని పరిశీలించిన ఆయన, కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ బావిని పునరుద్ధరించాలని కోరారు.