ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిని అక్రమ కేసులతో వేధించడం ఫాసిజమని, ఎన్ఐఏ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యాభై ఏళ్లుగా ప్రజా సమస్యలు, హక్కుల కోసం పోరాడుతున్న తనపై పాత కేసులన్నీ 2026 మార్చి నాటికే కోర్టులు కొట్టివేశాయని తెలిపారు. అయినా అకస్మాత్తుగా ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.