ఖమ్మం: తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు

7చూసినవారు
ఖమ్మం: తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు
ఖమ్మం కలెక్టరేట్ లో మంగళవారం, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో వేసవిలో త్రాగునీటి సమస్యలు, హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్షించారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని, కార్యాలయాలకు పరిమితం కాకుండా ఫీల్డ్‌లోనే ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్