ఖమ్మం: సాయితేజ ఇంటి వద్ద ఇది పరిస్థితి

1550చూసినవారు
అమెరికాలో దుండగుల కాల్పుల్లో చనిపోయిన సాయితేజ నివాసం వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. ఖమ్మం రాపర్తి నగర్ లోని వారి ఇంటికి బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. నూకారపు కోటేశ్వరరావు దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. ఉన్నత చదువుల కోసం తన పిల్లలను అమెరికా పంపించాడు. అయితే దుండగుల కాల్పుల్లో సాయితేజ మృతిచెందినట్లు సమాచారం వచ్చింది. దీంతో వారి నివాసానికి బంధువులు చేరుకుని ఓదార్చుతున్నారు.

సంబంధిత పోస్ట్