ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద ప్రవహిస్తున్న మున్నేరు ఉధృతిని, లోతట్టు ప్రాంతాలను గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీసు కమీషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఎగువ నుంచి వరద క్రమంగా తగ్గుతోందని, పెరిగే అవకాశం లేదని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.