రఘునాథపాలెం మండల పర్యటనను ముగించుకొని ఖమ్మం వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గమధ్యంలో చింతగుర్తి వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామానికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. వెంట పార్టీ శ్రేణులు ఉన్నారు.