శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని బూడిదెంపాడు గ్రామంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పత్తి, వరి పంటలను మంత్రి తుమ్మల తనయుడు, జిల్లా నాయకులు తుమ్మల యుగంధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు పరిశీలించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున అందిస్తామని భరోసా ఇచ్చారు.