ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మజ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షలు మార్చి 5 నుంచి 25 తేదీ వరకు జరగనుండగా 36, 660 మంది విద్యార్థుల కోసం 72 పరీక్ష కేంద్రాలను గుర్తించామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సూచించారు.