రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడుతూ, రెండో విడత నామినేషన్ల పరిశీలన, మూడో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు, కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు.