ఈ నెల 3న జరగనున్న
నీట్ (యూజీ) పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో, జిల్లా నుంచి 2,762 మంది
విద్యార్థులు హాజరవుతారని, వారి కోసం ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రాల్లోని సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షించాలని, నిషేధిత వస్తువులు, స్మార్ట్ వాచ్లు, ఆభరణాలు తీసుకురాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.