ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం పరిశీలించారు. గోదాం వద్ద పటిష్టమైన నిఘా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీసి, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, ఎన్నికల డీటీ అన్సారీ, ఉద్యోగులు పాల్గొన్నారు.