ఖమ్మం: ఏఎన్ఎం ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడు ఆఖరు

5చూసినవారు
ఖమ్మం: ఏఎన్ఎం ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడు ఆఖరు
ఖమ్మం నగరంలోని టేకులపల్లి దుర్గాబాయి మహిళా-శిశు వికాస కేంద్రంలో 2025-27 విద్యా సంవత్సరానికి ఎంపీహెచ్ఎడబ్ల్యూ (మహిళా)/ ఏఎంఎమ్ కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాలకు మంగళవారం చివరి అవకాశమని ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ పూర్తిగా ఉచితం, బీసీ-సీ, ఈ, ముస్లిం మైనారిటీలకు అవకాశాలున్నాయి. పూర్తి వివరాలకు 7660022512 నంబర్ను సంప్రదించాలి.