ఖమ్మం: పెళ్లైన రెండు నెలలకే విషాదం

64చూసినవారు
ఖమ్మం: పెళ్లైన రెండు నెలలకే విషాదం
వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన విష్ణువర్ధన్ (30)కు భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన యువతితో మే 2న వివాహమైంది. విష్ణు సాఫ్ట్‌వేర్ కాగా వారాంతపు సెలవు కావడంతో భార్యను కలిసేందుకు ఇల్లెందుకు వచ్చాడు. ఖమ్మంలో షాపింగ్ చేసేందుకు బైక్‌పై ఇద్దరూ వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ దంపతులపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా విష్ణువర్ధన్ మృతి చెందాడు. పెళైన రెండు నెలలకే విషాదం నెలకొనడం కలచివేస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్