ఖమ్మం: 1నుంచి వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ

9చూసినవారు
ఖమ్మం: 1నుంచి వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు డీవైఎస్ఓ టి. సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఉత్తీర్ణులైన వారికి సెట్విన్ నుంచి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల యువత విద్యార్హతలు, ఆధార్ కార్డు, ఫొటో, కుల ధ్రువీకరణ పత్రాలతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్