గ్రంథాలయ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కామేపల్లి లైబ్రేరియన్ లలితకుమారిని ఇల్లెందుకు, పండితాపురం నుంచి సీహెచ్. శ్రీనివాస్ ను జూలూరుపాడుకు, ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి రవిబాబును కొత్తగూడెం జిల్లా గ్రంథాలయానికి బదిలీ చేశారు. అలాగే, జూలూరుపాడు లైబ్రేరియన్ ఎం. నవీన్ కుమార్ ను పండితాపురం లైబ్రేరియన్ గా, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థలో వాచ్ మెన్ శ్రీకాంత్ ను ఖమ్మం గ్రంథాలయానికి మార్చారు.