తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్థాయి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.