ఖమ్మం జిల్లా అల్లీపురంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఆమోదం తెలిపింది. గతంలో ప్రతిపాదించబడిన ఈ ఆలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధంసలాపురం పరిధిలో 20 ఎకరాల భూమిని కేటాయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి భూమి కేటాయింపునకు కృషి చేశారు. టీటీడీ బోర్డు ఆమోదంతో ఆలయ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.