ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈనెల 9న నేలకొండపల్లిలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ. వెంకన్న, జి. రామయ్య ఆదివారం తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని చైతన్యం చేయడం, హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాడులను తిప్పికొట్టడం వంటి అంశాలపై ఈ తరగతులు దృష్టి సారిస్తాయి.