ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీసులు నిషేధిత గంజాయి ఆయిల్ (హషీష్ ఆయిల్) విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం ఉదయం యాపిల్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా, ఖమ్మం అర్బన్ వైఎస్ఆర్ నగర్కు చెందిన కొత్తా రాము, ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గుల శరత్లు కారులో సుమారు రూ.30లక్షల విలువైన హషీష్ ఆయిల్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.