ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి ఖమ్మం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, బ్రెత్ అనలైజర్ పరీక్షలో అనుమతించిన పరిమితికి మించి ఆల్కహాల్ స్థాయులు నమోదయ్యాయి. ధారావత్ సాయికి 15 రోజులు, యనాల అఖిల్ రెడ్డికి 7 రోజుల సాధారణ జైలు శిక్ష విధించబడింది.