సూర్యాపేట-ఖమ్మం 366/బి హైవేపై బండమీది చందుపట్ల గ్రామ సమీపంలో, అతివేగం కారణంగా టూ-వీలర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దాసారం గ్రామానికి చెందిన నవీన్ (26) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.