ఖమ్మం: రేపటి నుంచి యూడీఐడీ శిబిరాలు

74చూసినవారు
ఖమ్మం: రేపటి నుంచి యూడీఐడీ శిబిరాలు
దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించి యూడీఐడీ కార్డులు జారీ చేసేందుకు ఈనెల 12 నుంచి 28వరకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. దివ్యాంగులందరికీ ఖమ్మం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకోసం దివ్యాంగులు మీసేవ సెంటర్లు లేదా ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. 12. 17, 19, 21, 24, 26, 28వ తేదీల్లో క్యాంపులు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్