ఖమ్మం: రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

3చూసినవారు
ఖమ్మం: రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖమ్మం-పందిళపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి కుడివైపు చాతి కింద పుట్టుమచ్చ, కుడిచేయిపై సంజయ్, జోటీ అని పచ్చబొట్లు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సాయంతో మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 9848114202, 8712658589 నంబర్లలో సంప్రదించాలని జీఆర్పీ పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్