బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా శ్రామిక, బడుగు, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పై సోమవారం ఖమ్మంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన నిరసన తెలిపి, కేంద్ర ప్రభుత్వం, మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోట్లాది మంది ఉపాధి కూలీల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా, ఎరువుల రాయితీలో కోత విధించారన్నారు.