ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంప్ లో ఉన్న గిరిజన భవనం, నిరుపయోగంగా ఉన్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ల ప్రస్తుత పరిస్థితులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భవనాలలో అవసరమైన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.