ఖమ్మం: ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ

1చూసినవారు
ఖమ్మం: ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ
ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ ఫర్టిలైజర్ యాప్ ద్వారా విజయవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వారం రోజుల్లో 25,252 మంది రైతులు 1,08,721 యూరియా సంచులను యాప్ ద్వారా బుక్ చేసుకోగా, 87,350 సంచులను కొనుగోలు చేశారు. రైతులు తమ పంట రకం, విస్తీర్ణం ఆధారంగా జిల్లాలోని ఏ డీలర్ లేదా సొసైటీ వద్దనైనా యూరియాను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్