ఖమ్మం: నేడు ‘వనజీవి రామయ్య' చిత్రబృందానికి సత్కారం

0చూసినవారు
ఖమ్మం: నేడు ‘వనజీవి రామయ్య' చిత్రబృందానికి సత్కారం
పర్యావరణ పరిరక్షణకు కృషి చేసి పద్మశ్రీ అవార్డు పొందిన వనజీవి రామయ్య జీవితచరిత్ర ఆధారంగా రూపొందించిన లఘు చిత్రానికి గద్దర్ అవార్డు లభించింది. ఈ చిత్రబృందాన్ని గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు జిల్లా అటవీ శాఖ, వాస్విక్ ఫౌండేషన్ సంయుక్తంగా సన్మానించనున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రకృతి ప్రేమికులు, ప్రజలు పాల్గొనాలని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్