ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని యాంటి సెక్షన్ వర్క్ షాప్ లో బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక హైడ్రాలిక్, ఎలక్ట్రో-మెకానికల్ వెహికల్ లిఫ్టర్ ను ప్రారంభించారు. ఈ లిఫ్టర్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాల మరమ్మతులను వేగంగా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుందని, దీనివల్ల వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గి, సేవా సామర్థ్యం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.