ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన ఘోరంపై టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో శనివారం బాధితురాలిని పరామర్శించిన ఆమె, నిందితుడిని ఉరితీయాలని, కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఇల్లు, చిన్నారికి నెలకు రూ. 50,000 పెన్షన్ వచ్చేలా చూడాలని, వారికి భద్రత కల్పించాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు.