ఖమ్మం: వచ్చేనెల 1నుంచి అమల్లోకి వేతన సవరణ

0చూసినవారు
ఖమ్మం: వచ్చేనెల 1నుంచి అమల్లోకి వేతన సవరణ
ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్లో చేపట్టిన సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చర్యలు ప్రారంభమయ్యాయని, ఇందులో భాగంగా 2021 వేతన సవరణ వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలవుతుందని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరిరామ్ తెలిపారు. ఖమ్మంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందని, ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు. త్వరలోనే యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్