మొంథా తుఫాను వల్ల వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో, బాధిత రైతులకు అండగా నిలవాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బజ్జూరి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ఎకరానికి రూ. 30 వేలు, మిర్చి, పత్తి ఎకరానికి రూ. 50 వేలు, మొక్కజొన్నకు రూ. 27 వేలు నష్టపరిహారం అందించాలని కోరారు.