ఖమ్మంలో ఐఎన్టీయూసీ జిల్లా మహాసభలో వీఓఏల సమస్యలను పరిష్కరిస్తామని నాయకులు స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, వీఓఏల కనీస వేతనం, ఉద్యోగ, ఆరోగ్య భద్రత వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క దృష్టికి సమస్యలను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.