రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో ప్రమాదాల నియంత్రణపై సమావేశం నిర్వహించారు. ప్రతి ఇక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించేలా చూడాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు.